పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 3 రోజుల క్రితం వ్యాపారి ఇంట్లో దొంగతనం మరువకముందే... మరో న్యాయవాది ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బంగారంతో పాటు 10 కిలోల వెండి, 10 వేల రూపాయల నగదును అపహరించారు. పట్టణానికి చెందిన వేమూరు శ్రీనివాస్ అనే న్యాయవాది శుభకార్యం నిమిత్తం మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరం వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చి చూస్తే తలువులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్ తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో న్యాయవాది ఇంట్లో చోరీ - west godavari latest crime news
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఓ న్యాయవాది ఇంట్లో బంగారం, వెండి, నగదును దుండగులు దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ న్యాయవాది ఇంట్లో చోరీ