పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆక్రమణలను అధికారులు తొలగించారు. 516డీ జాతీయ రహదారిపై ఉన్న నివాస గృహాలు, దుకాణాలను యంత్రాల ద్వారా కూలగొట్టారు. స్థానిక ప్రజలు మొదట్లో కొంత వారిని ప్రతిఘటించారు.
భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు స్థానికులను అడ్డుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య వందలాది దుకాణాలు, నివాస గృహాలను అధికారులు తొలగించారు. తొలగిస్తున్న దుకాణాలు, నివాసగృహాలు ఆర్అండ్బీ రహదారిపై ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.