పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్త నవరసపురం నుంచి ఎలమంచిలి మండలం మేడపాడు వరకు సుమారు 15 కిలో మీటర్ల రహదారి ఉంది. ఈ రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. ఫలితంగా రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దుస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించగా... వారి నుంచీ స్పందన లేదు.
కుమారుడి పెళ్లి కోసం.. సొంత సొమ్ముతో రహదారికి మరమ్మతులు - Road repairs with own money in west godavari district
రెండేళ్లుగా భారీ గుంతలతో అధ్వానంగా మారిన రహదారి కారణంగా... తన కుమారుడి వివాహ వేడుకకు వచ్చేవారు ఇబ్బంది పడతారని భావించిన న ఓ వ్యక్తి రూ. రెండు లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
ఈ నేపథ్యంలో కొత్త నవరసపురం గ్రామానికి చెందిన చిందాడి నిరీక్షణరావు.. తన కుమారుడికి వివాహం జరిపించాలని నిర్ణయించాడు. వేడుకకు హాజరయ్యేవారికి రహదారి వల్ల ఇబ్బంది అవుతుందని భావించి తన సొంత సొమ్ము రూ.రెండు లక్షలు వెచ్చించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. విషయం తెలుసుకున్న రహదారులు భవనాల శాఖ డీఈ హరిప్రసాద్ ఈ రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నుంచి రూ.40 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదీచదవండి: ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా? - చంద్రబాబు