పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద గల 16వ జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. తణుకు మహిళా కళాశాల సమీపంలో రహదారిపై ఆగి ఉన్న లారీని కారు అతి వేగంగా ఢీకొట్టింది. ఫలితంగా కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
బాధితులకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స..
మరడా గౌరినాయుడు, అతని భార్య, కుమారుడు, కుమార్తె సహా మనుమరాలుకు తీవ్రగాయాలు కావటంతో తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి విజయనగరం జిల్లా పార్వతీపురానికి కారులో వెళ్తుండగా నిద్ర మత్తులో లారీని ఢీకొట్టినట్టు సమాచారం. మృతుడితో పాటు క్షతగాత్రులను గిద్దలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి : ఆ మంత్రుల పనితీరుపై మోదీ సమీక్ష!