పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద జాతీయ రహదారిపై సోమవారం అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇరువురు సురక్షితంగా బయటపడ్డారు. చెరుకువాడకు చెందిన రామకృష్ణ, డ్రైవర్ వీరవాసరంకు చెందిన వర ప్రసాద్ తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. చేబ్రోలు వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ను దాటి పక్క రహదారిలో బోల్తాపడింది. ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేబ్రోలు పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.
అదుపు తప్పిన కారు.. తప్పిన ప్రాణాపాయం - పశ్చిమగోదావరి తాజా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలం జాతీయ రహదారిపై సోమవారం అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
![అదుపు తప్పిన కారు.. తప్పిన ప్రాణాపాయం చేబ్రోలు వద్ద అదుపు తప్పిన కారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8970308-208-8970308-1601291835021.jpg)
చేబ్రోలు వద్ద అదుపు తప్పిన కారు