పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన మొక్కజొన్న పొలంలో కంకులు తీసేందుకు సుమారు 40 మంది వ్యవసాయ కూలీలు వెళ్లారు. పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కామవరపుకోట శివారులో వీరు ప్రయాణిస్తోన్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మంగమ్మ అనే మహిళ మృతి చెందగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కామవరపుకోట, ద్వారకా తిరుమల ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమించటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం... మహిళ మృతి, 20 మందికి గాయాలు - road accident news in west godavari
పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 40 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తోన్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కామవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి