పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పేరంపేట గ్రామానికి చెందిన కంకిపాటి శ్రీను తలకు బలమైన గాయం కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చమటపోయిన రమేష్, బుట్ట సాయిలు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం... ముగ్గురికి గాయాలు - జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం
జంగారెడ్డిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
road accident in jangareddygudem