పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని తల్లాడ-దేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. బుట్టాయగూడెనికి చెందిన ఇజ్రాయిల్, కుమారి దంపతులు జంగారెడ్డిగూడెం నుంచి బైక్‌పై వస్తూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు.
రోడ్డుప్రమాదం... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ద్విచక్రవాహనంపై నుంచి పడి ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయాలపాలైన ఘటన.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.
జంగారెడ్డి గూడెంలో రోడ్డు ప్రమాదం
ఈ ఘటనలో ఇజ్రాయిల్‌కు బలమైన గాయం అయ్యి చికిత్స పొందుతూ మృతిచెందారు. అతని భార్య కుమారి ఏలూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ కూడా అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి... చుట్టూ నీళ్లున్నా... వారికి తాగునీరు లేదు