ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోజనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - ఉంగటూరు మండలం చేబ్రోలులో రోడ్డు ప్రమాదం

గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి 216-ఏ పై జరిగింది.

road accident in chebrole
చేబ్రోలులో రోడ్డు ప్రమాదం

By

Published : Apr 19, 2021, 9:49 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి 216-ఏ పై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని గుర్తు తెలియని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. వీరు తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా చెర్ల ఇటిక్యాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

లారీలో చేపల మేత (తవుడు) వేసుకుని ఉంగుటూరు మండలం రాచూరుకు వచ్చారు. లారీని చెరువు దగ్గర నిలిపి భోజనానికి ద్విచక్ర వాహనంపై నారాయణపురం మీదుగా చేబ్రోలు బయల్దేరారు. ఈ సమయంలో అదే మార్గంలో వెళుతున్న లారీ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​ స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్​ మంతటి రామస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details