తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి సమీపంలో కాకర్లపల్లికి చెందిన మర్రి అంజయ్య, మర్రి హరిబాబు కృష్ణాజిల్లా నందివాడ మండలం పూలకుంటలో చేపల చెరువులకు కాపలాగా ఉంటున్నారు. వీరు.. వేణు అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఏలూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా బాపిరాజుగూడేనికి వచ్చే సరికి గుర్తుతెలియని వాహనం.. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అంజయ్య, హరిబాబు అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవ పరీక్ష నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు - పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లా బాపిరాజుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు