ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి - road accident at west godavari news update

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో వాహనంపై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.

road accident
రెండు ద్రిచక్రవాహనాలు ఢీ

By

Published : Nov 19, 2020, 2:28 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బజాజ్ షోరూంలో మెకానిక్​గా పనిచేసే సాయి.. విధుల్లో భాగంగా భీమవరం వెళ్లి స్పేర్ పార్ట్స్ తీసుకొని వస్తుండగా.. తాడేపల్లిగూడెం నుంచి నల్లజర్ల వెళ్లే రోడ్డులో వెంకట రామన్న గూడెం వద్ద కడపకు చెందిన మరో వ్యక్తి.. ఎదురుగా వచ్చి సాయి నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో యర్నగూడెం గ్రామానికి చెందిన గంజి సాయి కిరణ్ కుమార్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఏరియా హాస్పిటల్​కు తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఇన్​ఛార్జ్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details