Accident: కైకరం వద్ద ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి - పశ్చిమగోదావరి జిల్లా కైకరం వద్ద రోడ్డుప్రమాదం వార్తలు
11:25 October 13
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం శివారు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో బాలుడు గాయపడ్డాడు.
ఉంగుటూరు మండలం కైకరం శివారు 216 జాతీయ రహదారిపై.. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి పలు కుటుంబాలు ఉంగుటూరు లోని కోళ్ల ఫారంలో పని చేసేందుకు నాలుగు నెలల కిందట వలసవచ్చాయి. వీరిలో తూర్పుగోదావరిలోని రౌతులపూడి మండలం శృంగవరం గ్రామానికి చెందిన కొవ్వూరి నరేష్ (18), ప్రత్తిపాడు మండలం పెదసంకెళ్లపూడికి చెందిన కాకరపు రోహిత్ (19), గోకవరం మండలం ఇటుకలపల్లి గ్రామానికి చెందిన కర్రి గణేష్ అనే బాలుడు.. కలిసి ద్విచక్ర వాహనంపై ఏలూరు వైపు ప్రయాణిస్తున్నారు. అదే మార్గంలో వెళ్తున్న లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొవ్వూరి నరేష్, కాకరపు రోహిత్ మృతి చెందారు. గణేష్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఇదీ చదవండి: Sexual assualt: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం
TAGGED:
కైకరం వద్ద ప్రమాదం వార్తలు