జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరానికి చెందిన సత్యనారాయణ పని నిమిత్తం తాడువాయి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. లక్ష్మీపురం వంతెన వద్ద తెలంగాణ నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును సత్యనారాయణ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
బస్సును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి - బైక్ను ఢీ కొట్టిన బస్సు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
![బస్సును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి road accident and person died in west godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10209706-364-10209706-1610425149232.jpg)
road accident and person died in west godavari