ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణతంత్ర దినోత్సవ ప్రత్యేకం.. త్రివర్ణపతాకం అలంకరణలో అమ్మవారు

పశ్చిమగోదావరి జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెనుగొండలోని వాసవీ మాత మరకత శిల్పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు త్రివర్ణపతాకం రంగుల రూపంలో అమ్మవారిని అలంకరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

republic day celebrations at west godavari district
republic day celebrations at west godavari district

By

Published : Jan 26, 2021, 5:31 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనికులు వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని రక్షిస్తున్నారని కొనియాడారు.

త్రివర్ణపతాకం అలంకరణలో అమ్మవారు..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాసవి అమ్మవారిని త్రివర్ణపతాకం రంగుల రూపంలో అలంకరించి దేశ భక్తిని చాటుకున్నాడు ఓ అర్చకుడు. పెనుగొండలోని వాసవీ మాత మరకత శిల్పాన్ని ప్రధాన అర్చకుడు మణికంఠ భారత మాత రూపంలో అలంకరించారు. అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చిన భక్తులు.. అలంకరణ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా మాంసాహార విక్రయాలు..

గణతంత్రదినోత్సవం వేళ పశ్చిమగోదావరి జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో మాంసాహార విక్రయాలు జోరుగా సాగాయి. జాతీయ పర్వదినాల్లో మాంసాహార విక్రయాలు చేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. నిబంధన అమలు చేయవలసిన అధికారులు పట్టించుకోలేదు.

ఇదీ చదవండి:అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ABOUT THE AUTHOR

...view details