పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాకలో ఎంపీటీసీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. గురువారం జరిగిన పోలింగ్‌లో బ్యాలెట్ పత్రాలు తారుమారైనందున.. కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి లక్ష్మారెడ్డి రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు.
రాపాకలో ప్రశాంతంగా రీపోలింగ్.. - mptc elections t rapaka
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాకలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బ్యాలెట్ పత్రాలు తారుమారు కావటంతో ఆర్డీవో లక్ష్మారెడ్డి రీపోలింగ్‌కు ఆదేశించారు.
రాపాక - సూరంపూడి గ్రామాలకు కలిపి ఒకే ఎంపీటీసీ స్థానం ఉంది. వైకాపా, తెదేపా, భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాపాక ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 26వ కేంద్రంలో ఉదయం పోలింగ్ ప్రారంభమై 500 ఓట్ల వరకు ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తెదేపా ఏజెంట్ బ్యాలెట్ పత్రంలో పార్టీల చిహ్నాలు మారాయనే విషయాన్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బ్యాలెట్ పత్రాల పుస్తకాన్ని పరిశీలించగా పెనుగొండ మండలం సిద్ధాంతం-2 ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన పత్రాలు కనిపించాయి. తారుమారైన బండిల్‌లోని 34 బ్యాలెట్లను ఓటర్లు వినియోగించారు. మండల రిటర్నింగ్ అధికారి పి.శ్రీనివాసరావు, సహాయ రిటర్నింగ్ అధికారి రాజేశ్వరరావు.. ఆర్డీవో లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన పరిశీలించారు. రీపోలింగ్ నిర్వహించాలని ఆర్డీవో లక్ష్మారెడ్డి ఆదేశించారు.
ఇదీ చదవండి: మళ్లీ లాక్‌డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్