నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత ఇన్‌ఫ్లో లక్షా 52 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 90 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు అధికారులు 7 గేట్లు ఎత్తి 90వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77టీఎంసీలు కాగా... ప్రస్తుతం 31.50 టీఎంసీలు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తికి 13వేల క్యూసెక్కుల వినియోగిస్తున్నారు. సాగర్ నుంచి మరింతగా వరద వచ్చే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశముంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Pulichintala project: పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల - పులిచింతల ప్రాజెక్టు తాజా వరద ఫ్లో
పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి లక్షా 52 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి 90వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల