ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధుల విడుదల - పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇబ్బందులు తప్పనున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని 92 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కొక్క దానికి లక్షా 75 వేల రూపాయల వంతున కోటి 61 లక్షల రూపాయలను విడుదల చేసింది.

Release of funds to primary health centers  in west godavari district
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

By

Published : Jun 1, 2020, 12:45 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు లేకపోవడంతో చిన్నపాటి అవసరాలకు సైతం ఇబ్బంది ఇబ్బంది పడ్డారు. 2019- 20 సంవత్సరానికి సంబంధించి ఎన్నికల నియమావళి కారణంగా హెచ్​డీఎస్ నిధుల విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని 92 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కొక్క దానికి ...లక్షా 75 వేల రూపాయల వంతున కోటి 61 లక్షల రూపాయలను విడుదల చేసింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీల తీర్మానాల మేరకు నిధులను వినియోగించాల్సి ఉంటుంది. ఆసుపత్రి మరమ్మతులు, సమావేశాల నిర్వహణ, రోగులకు వసతి కల్పన, విద్యుత్, తాగునీరు, పన్నులు చెల్లింపులు, మందులు, బ్యాండేజీల కొనుగోలు అత్యవసర సమయాల్లో రోగులను ప్రాంతీయ ఆస్పత్రులకు తరలించేందుకు ఈ నిధులను వినియోగించాలి. పారిశుద్ధ్య పనుల కోసం జిల్లాలోని ప్రతి గ్రామానికి 10వేల రూపాయల వంతున నిధులు విడుదల చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 908 పంచాయతీలకు నిధులు విడుదలయ్యాయి. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు బ్లీచింగ్ చల్లించేందుకు, తాగునీటి వనరుల క్లోరినేషన్, పారిశుద్ధ్య పనులు నిర్వహణకు నిధులు వినియోగించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఏఎన్ఎం గ్రామ కార్యదర్శులతో కూడిన కమిటీ నిర్ణయం మేరకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details