ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాకీ తీర్చమన్నందుకు వ్యక్తి హత్య.. గ్రామస్థుల ఆందోళన - పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా జాజులకుంట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కర్రతో కొట్టి హత్య చేసిన నిందితుణ్ని అరెస్టు చేయాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో నిందితుడి ఇంటి ముందు ధర్నా చేశారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Relatives descended to the dharna by the dead body
మృతదేహంతో ధర్నా కు దిగిన బంధువులు

By

Published : Mar 10, 2020, 8:45 PM IST

మృతదేహంతో నిందితుడి ఇంటి ముందు బంధువుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని జాజులకుంట గ్రామంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఆల సత్యనారాయణ నాలుగు రోజుల క్రితం తనకు రావాల్సిన డబ్బులు అడిగేందుకు కంచర్ల నాగు అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. తన బాకీ చెల్లించాలని గట్టిగా అడగటంతో నాగు.. సత్యనారాయణను కర్రతో బలంగా మోదాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఏలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ ఇవాళ మృతి చెందాడు. దీనిపై మృతుని బంధువులు, గ్రామస్థులు నిందితుని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నాగును వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీనిపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details