ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పెరిగిన కరోనా కేసులు..భయాందోళనలో ప్రజలు - red zone in eluru news

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో కరోనా పంజా విసురుతోంది. జిల్లాలో 1120 కేసులు నమోదు కాగా.. ఏలూరు నగరంలోనే 760కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో వీధులన్నీ మూగబోయాయి.

redzone in eluru
ఏలూరు నగరంలో కరోనా

By

Published : Jul 3, 2020, 3:37 PM IST

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు నగరంలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో 1120 కేసులు నమోదుకాగా.. ఏలూరు నగరంలోనే 760కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని అనేక వీధులు కొవిడ్ బారినపడి నిర్మానుష్యంగా మారాయి. వీధుల్లో జనసంచారం పూర్తిగా మందగించింది. ఆయా వీధుల్లో ప్రజలు ఐసొలేషన్​కు వెళ్లడం, క్వారంటైన్​కు వెళ్లడం వల్ల ఇళ్లకు తాళాలుపడ్డాయి. మిగిలినవారు భయపడి.. వీధులను ఖాళీ చేస్తున్నారు.

ఏలూరు నగరంలో కొత్తపేట, సబ్బువారివీధి, నాగేంద్రపురం, ఇందిర కాలనీ, టీచర్స్ కాలనీల్లో నిశ్శబ్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయడం వల్ల.. ప్రజలు ఎక్కడా కనిపించట్లేదు.

ఇదీ చూడండి. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదా?: ఎమ్మెల్యే వాసుపల్లి

ABOUT THE AUTHOR

...view details