38ఎర్రచందనం దుంగలు స్వాధీనం - west godavari
పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 38 ఎర్రచందనం దుంగలను గుర్తించారు.
38ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మధ్యాహ్నపుగూడెంలోని ఓ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నాగేశ్వరరావుకు చెందిన నిమ్మతోటలో దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 38 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.