ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు...! - READY FOR MUNICIPAL ELECTIONS

పురపాలక సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవుతుందని భావిస్తున్న అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రకటించగా అభ్యంతరాలుంటే తెలపాలని సూచిస్తున్నారు.

ready-for-municipal-elections
పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

By

Published : Feb 4, 2020, 9:30 PM IST

Updated : Feb 5, 2020, 12:53 AM IST

పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు...!

పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సమాయాత్తమవుతున్నారు. కులాలవారీగా లెక్కింపు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాల ప్రచురణ పనుల్లో...ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. తాజాగా పురపాలక సంఘాల్లో వార్డులు వారి ఓటర్ల జాబితాలను సోమవారం ప్రచురించింది. ఈ జాబితాలను తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడంతో పాటు... రాజకీయ పక్షాలు నాయకులకు అందజేశారు. ప్రకటించిన జాబితాలో అభ్యంతరాలు సవరణలు ఏమైనా ఉంటే సూచించాలని వారు కోరారు.

కులాల వారి లెక్కింపులో గందరగోళం...

కులాల వారి లెక్కింపునకు సంబంధించి మొదటిసారి కొన్ని పురపాలక సంఘాలలో గందరగోళం.... మరికొన్ని పురపాలక సంఘాల్లో తప్పులు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు రెండోసారి కులాల వారీగా లెక్కింపు చేపట్టారు. ఈ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.

ప్రభుత్వ నిర్ణయానికి సర్వోన్నత న్యాయస్థానం బ్రేక్...

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 176 నెంబర్ జీవో ప్రకారం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడం వల్ల ఎన్నికలకు బ్రేక్ పడింది. రిజర్వేషన్ విషయంలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 16వ తేదీ నాటికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు 59.85 శాతం రిజర్వేషన్లకు అంగీకరిస్తే పురపాలక ఎన్నికల్లో రిజర్వేషన్లు అదే స్థాయిలో అమలు చేయవలసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందన్న విషయం తెలియటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పురపాలక పదవులు కోరుకుంటున్నవారు చక్కర్లు కొడుతున్నారు.

ఇవీ చదవండి:

పురపాలక నూతన భవన నిర్మాణానికి మంత్రి బుగ్గన భూమి పూజ

Last Updated : Feb 5, 2020, 12:53 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details