పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెదేపా, వైకాపా నాయకుల వాగ్వాదంపై ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి విచారణ చేపట్టారు. జడ్పీటీసీ నామినేషన్లకై వైకాపా నాయకులు తనను బెదిరించారంటూ మంగళవారం తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి తెదేపా అభ్యర్థి పారేపల్లి నరసింహమూర్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ అదేశాల మేరకు జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాల్సిందిగా జంగారెడ్డిగూడెం ఆర్డీవోను ఆదేశించారు. ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి ఇరు పార్టీల నాయకులతో మాట్లాడారు. వైకాపా నాయకులు ఇబ్బందిపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని పారేపల్లి నరసింహమూర్తి అన్నారు. ఏకగ్రీవం చేసిన ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ఇతర శాఖ అధికారులు వైకాపాకు అండగా ఉంటున్నారని తెదేపా నాయకుడు రామ్ కుమార్ ఆరోపించారు.
జంగారెడ్డిగూడెంలో ఇరు పార్టీల ఘర్షణ..ఆర్డీఓ విచారణ - RDO inquiry into tdp and ysrcp clashes
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తేదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణలపై ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి విచారణ చేపట్టారు. జడ్పీటీసీ నామినేషన్లను ఉపసంహరించుకునేలా వైకాపా నాయకులు తనని భయపెట్టారని.. తెదేపా అధినేతతో కలిసి తెదేపా అభ్యర్థి పారేపల్లి నరసింహమూర్తి ఈసీకి ఫిర్యాదు చేశారు.
తెదేపా నాయకులతో మాట్లాడుతున్న ఆర్టీఓ