పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు రేషన్ డీలర్లు రెచ్చిపోతున్నారు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని తూకాల్లో మోసం చేస్తూ పేదప్రజలను దోచుకుంటున్నారు. నిరుపేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, నిత్యావసర సరకులను పక్కదారి పట్టిస్తున్నారు. మిల్లర్లు, వ్యాపారులకు విక్రయిస్తూ... సొమ్ము చేసుకుంటున్నారు
పేదల బియ్యం పక్కదారి - checkings
పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు రేషన్ డీలర్లు రెచ్చిపోతున్నారు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని తూకాల్లో మోసం చేస్తూ పేదప్రజలను దోచుకుంటున్నారు.
పౌరసరఫరా అధికారుల తనిఖీలు
జిల్లాలో మొత్తం 12 లక్షల 51వేల 831మంది సరకులు తీసుకుంటుండగా... మొత్తం రేషన్ షాపులు 2,186 ఉన్నాయి. తరచూ ఏదో ఒక చోట విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నా... డీలర్ల అక్రమాలు ఆగడం లేదు. జిల్లా మొత్తానికి 19వేల టన్నులు బియ్యం వస్తుండగా... వాటిలో సుమారు 25 వేల కుటుంబాలకు సరిపడా రేషన్ నల్లబజారుకు తరలిపోతుందని పౌరసరఫరా అధికారులు వెల్లడించారు. నిత్యావసర సరకులు ప్రజలకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపి... అక్రమ దారిలో తరలిస్తున్నారని తెలిపారు.