ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

250 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - ఉండ్రాజవరం తాజావార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని రైస్​మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు.

ration rice
రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : May 6, 2021, 10:03 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని రైస్​మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా.. భారీ స్థాయిలో నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్నామని చెప్పారు. ముందస్తుగా అందిన సమాచారంతో సోదాలు నిర్వహించామన్నారు.

మొత్తంగా.. 250 టన్నుల రేషన్ బియ్యం, 1.2 టన్నుల నూకలు సీజ్​ చేసినట్లు అధికారులు చెప్పారు. రైస్ మిల్లు నిర్వాహకుడు అందుబాటులో లేని కారణంగా.. పూర్తి సమాచారం సేకరించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details