Ration rice seized: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పీఎస్ పరిధిలో బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా నుంచి కాకినాడకు తలిస్తుండగా లారీలను పట్టుకున్నట్లు తెలిపారు. రెండు లారీల్లో 600 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని.. విలువ సుమారు 18.6 లక్షలు ఉంటుందని చెప్పారు.
బియ్యం తరలిస్తున్న గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నేరెళ్ల కోదండరాంతో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.