పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలోని ఓ వ్యాపారి ఇంట్లో నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వ్యాపారి స్థానికంగా కొనుగోలు చేసి విక్రయాలు చేపడుతున్నట్లు గుర్తించినట్లు విజిలెన్స్ సీఐ విల్సన్ తెలిపారు. వ్యాపారిపై కేసు నమోదు చేశామని అన్నారు. అతని వద్ద నుంచి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ తహసీల్దార్ రవికుమార్ తెలిపారు.
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత - జీలుగుమిల్లిలో రేషన్ బియ్యం పట్టివేత తాజా వార్తలు
అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
10 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం