ఉండ్రాజవరం మండల పరిధిలోని రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. రేషన్ పంపిణీ, దుకాణాల నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలంటూ రేషన్ డీలర్ల సంఘం జిల్లా నాయకుడు రంగ పేర్కొన్నారు.
సర్వర్ మొరాయింపులు, రెండు సార్లు వేలిముద్రలు వేయించాల్సి ఉన్నందున సమయం వృథా అవుతుందని తెలిపారు. తమకు రావాల్సిన పది విడతల కమీషషన్ ఇప్పించాలని, గోనె సంచుల బకాయిలను ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కనకరాజుకు వినతిపత్రం సమర్పించారు.