ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భవిష్యత్తులో డీలర్లను కొనసాగిస్తామని జీవో విడుదల చేయాలి' - ఏలూరులో చౌకధర డీలర్ల సమావేశం

రాష్ట్ర డీలర్ల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డీలర్లు సమావేశం నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని.. భవిష్యత్తులో డీలర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Ration Dealers meeting at eluru
భవిష్యత్తులో డీలర్లను కొనసాగిస్తామని జీవో విడుదల చేయాలి

By

Published : Dec 4, 2020, 10:11 PM IST

చౌకధర డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఇంటికే రేషన్ సరకులు పంపిణీని రాష్ట్ర చేపడుతున్న నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు. డీలర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని.. దానికి లోబడి జీవోను విడుదల చేయాలని డీలర్ల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డీలర్లను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details