పశ్చిమగోదావరిజిల్లా తణుకులోని మల్లికాసులపేటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ ప్రమాదంలో 46 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనలో ఆయా కుటుంబాలకు చెందిన రేషన్‌కార్డులు కాలిపోయాయి. స్పందించిన రెవెన్యూ అధికారులు కొత్త కార్డులు మంజూరుచేశారు. వాటితో పాటు దాతలు సమకూర్చిన చీరలు, బియ్యాన్ని బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు.
అగ్నిప్రమాద బాధితులకు రేషన్ కార్డుల పంపిణీ - west godavari ration card distribution news
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని మల్లికాసులపేటలో ఇటీవల అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు స్థానిక ఎమ్మెల్యే రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ ఘటనలో మొత్తం 46 పూరిళ్లు దగ్ధమయ్యాయి.

తణుకు అగ్నిప్రమాద బాధితులకు రేషన్ కార్డుల పంపిణీ
అగ్నిప్రమాద బాధితులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇవీ చూడండి:
Last Updated : Nov 4, 2019, 1:14 PM IST