ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారకా తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లు ఆలయ ప్రాంగణంలో విహరించారు. రథయాత్రతో భక్తులను, చూపరులను ఆద్యంతం అలరించాయి.

rathasapthami celebrations in dvaraka tirumala
ద్వారకాతిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి

By

Published : Feb 19, 2021, 7:25 PM IST

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగింది. పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం, సాయంత్రం కొనసాగిన సేవలు భక్తులను ఆద్యంతం అలరించాయి. ప్రభాతవేళ సప్త అశ్వాలను అధిరోహించిన శ్రీవారు ఉభయదేవేరులతో సూర్యప్రభ వాహనంపై కొలువై ఆలయ ప్రాంగణంలో విహరించారు.

భక్తులకు అభయ హస్తాన్ని ప్రసాదిస్తూ స్వామి వారు, ఉభయదేవేరులతో దర్శనమిచ్చారు. సూర్య, చంద్రప్రభ వాహనాలపై దేదీప్యమానంగా వెలుగొందిన స్వామి అమ్మవార్ల దివ్య మూర్తులను దర్శించి భక్తులు తరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details