ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తొలి విడత నిర్వాసితుల కాలనీల నిర్మాణం మే నెలాఖరుకు పూర్తి' - పోలవరం తాజా సమాచారం

పోలవరం నియోజకవర్గాన్ని ఆర్​ అండ్ ​ఆర్​ కమిషనర్ గురువారం​ సందర్శించారు. కాఫర్​ డ్యాం ఎగువ భాగంలో ఉన్న కాంటూరు పరిధిలోని నిర్వాసిత గ్రామాలను తరలించేందుకు తొలి విడతలో 21 కాలనీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

randr commissioner visit polavaram in west godavari district
పోలవరాన్ని సందర్శించిన ఆర్​అండ్​ఆర్​ కమిషనర్​

By

Published : Apr 23, 2020, 7:53 PM IST

మే నెలాఖరుకు తొలి విడతలో పోలవరం నిర్వాసితుల ఇళ్ల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆర్​ అండ్ ​ఆర్ కమిషనర్ డాక్టర్ టి. బాబూరావు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి, కుక్కునూరు, బుట్టాయిగూడెం మండలాల్లో నిర్మాణంలో ఉన్న నిర్వాసిత ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. కాఫర్ డ్యాం ఎగువ భాగంలో ఉన్న 41 కాంటూరు పరిధిలోని నిర్వాసిత గ్రామాలను తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఏ, బి కేటగిరీలుగా విభజించి తొలి విడతలో ముంపునకు గురవుతున్న గ్రామాలను తరలించేందుకు 21 కాలనీలు మే నెలలో పూర్తి చేస్తామన్నారు. రెండో విడతలో 12 కాలనీలను జూన్- జూలై నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇసుక కొరతపై గుత్తేదారులు బాబూరావు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం లేకుండా చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details