అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో శ్రీరామ భక్తులు పాదయాత్ర నిర్వహించారు. రామబంటు హనుమంతుని భుజాలపై అధిరోహించిన రామలక్ష్మణుల విగ్రహాలను వాహనంపై ఉంచి యాత్ర నిర్వహించారు. అయోధ్య రామ మందిర నిర్మాణ కరసేవకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
వేలివెన్నులో శ్రీరామభక్తుల పాదయాత్ర - పశ్చిమ గోదావరి వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో శ్రీరామ భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమలో అయోధ్య రామలయ నిర్మాణ కరసేవకులు పాల్గొన్నారు.
వేలివెన్నులో శ్రీరామభక్తుల పాదయాత్ర