పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో తెదేపా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నరసాపురం కాకుండా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని మాధవనాయుడు అన్నారు. తీర ప్రాంత అభివృద్ధి ఈ జిల్లా కేంద్రంతోనే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ప్రదర్శన అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెలుగుదేశం ధర్నా - tdp rally news
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల విభనను ప్రకటించటంతో జిల్లా కేంద్రాల విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.
తెదేపా ఆధ్వర్యలో ర్యాలీ