పశ్చిమగోదావరి జిల్లాలో 3, 41, 003 రైతు కుటుంబాలకు రెండో విడత రైతు భరోసా కింద రూ. 82.04 కోట్లు జమ కానున్నాయి. ఒక్కొక్క ఖాతాకు రెండు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు. వీటితో పాటు జూలై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు 21,242 మంది రైతులకు చెందిన 10398.98 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
జిల్లా రైతులకు... రైతు భరోసా, సబ్సిడీ సాయం - పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత రైతు భరోసా నిధులు
రైతు భరోసా, పీఎం కిసాన్ 2020- 21 సంవత్సరానికి పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 82.04 కోట్లు రైతుల ఖాతాలో జమ కానుంది. దీంతో పాటు గడిచిన మూడు నెలల్లో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు 15 కోట్ల 59 లక్షల రూపాయలు కూడా వారి ఖాతాలో జమ కానున్నాయి
రైతుల ఖాతాలో జమకానున్న రైతు భరోసా నగదు
పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 15.59 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో విడత రైతు భరోసా, సబ్సిడీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి