ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు రాష్ట్రానికి మోదీ.. భీమవరంలో కురుస్తున్న వర్షం - భీమవరంలో వర్షం

RAIN TROUBLE: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఏర్పాట్లకు వర్షం ఆటంకం కలిగించింది. అల్లూరి 125వ జయంతి వేడుకలకు సోమవారం నాడు మోదీ భీమవరం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే భీమవరంలో రాత్రి చాలా సేపు వర్షం కురిసింది. దీంతో సభా ప్రాంగణం తడిసి ముద్దయింది.

RAIN TROUBLE
వర్షానికి తడిసిముద్దైన సభా ప్రాంగణం

By

Published : Jul 3, 2022, 10:23 AM IST

Updated : Jul 3, 2022, 1:27 PM IST

RAIN TROUBLE: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. భీమవరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షంతో రేపటి ప్రధాని పర్యటన ఏర్పాట్లకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈదురుగాలులకు పలుచోట్ల హోర్డింగ్​లు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి బహిరంగ సభా ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. బహిరంగ సభకు ప్రధాని మోదీ , ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు, నిర్వాహకులు, హుటాహుటిన నీరు తొలగించి, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సభా వేదికతో పాటు ప్రాంగణం అంతా 70 వేల మంది వరకూ కూర్చునేలా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా అల్లూరి 125వ జయంతి వేడుకలు జరిగేలా యంత్రాంగమంతా శ్రమిస్తోంది. వర్షం ఇబ్బందులు తొలగకపోతే ప్రజల రాకతో పాటు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వర్షానికి తడిసిముద్దైన సభా ప్రాంగణం
Last Updated : Jul 3, 2022, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details