పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడులోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు బిహార్‌కు చెందిన సుజిత్ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఇతను రైల్వే టెలికాం శాఖలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కళాశాల వెనుక గేట్ క్యాబిన్లో ఫోన్ రిపేరు నిమిత్తం వెళ్లినట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఉదయం 6 గంటల సమయంలో సుజిత్ కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పెంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాజేశ్వరరావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే ఉద్యోగి దారుణ హత్య - పశ్చిమగోదావరి జిల్లా తాజా సమాచారం
పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైల్వే ఉద్యోగిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే ఉద్యోగిని హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు