తనను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. సీఎం, ఆయన బంధుమిత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఒకే సమయంలో అక్షరం పొల్లు పోకుండా ఫిర్యాదులు చేశారని వివరించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విషయం తెలియజేస్తానని రఘురామ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా విచారణ జరపాలని కోరుతానని వెల్లడించారు.
'నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు' - Raghu Rama Krishna Raju comments on Jagan
సీఎం, ఆయన బంధుమిత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎంపీ రఘురామరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అరెస్టుచేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విషయం తెలియజేస్తానని... రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా విచారణ జరిపాలని కోరతానని వెల్లడించారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు
Last Updated : Mar 5, 2021, 6:17 PM IST