ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరిలో ముందుకు జరుగనున్న రబీ.. - పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం పశ్చిమ గోదావరిలో ముందుగా ముగియనున్న రబీ

పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం.. ఏప్రిల్ 10 నాటికి రబీ పంట సీజన్​ను పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. మార్చి నెలాఖరుకు నీటి సరపరా నిలిపివేసి.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

rabi will end early
ముందే ముగియనున్న రబీ

By

Published : Dec 2, 2020, 6:40 PM IST

పశ్చిమ గోదావరిలో పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా.. రబీ సీజన్​ను ముందుకు తీసుకొచ్చారు. రబీ పంటల సాగుపై వ్యవసాయ అధికారులతో కలెక్టర్ ముత్యాలరాజు సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 నాటికి రబీ సాగు పూర్తిచేయాలని ఆదేశించారు.

మార్చి 31, 2021 నాటికి పోలవరం ప్రాజెక్టుకు నీటి సరఫరాను నిలిపివేసి.. పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో రబీ పంటసాగుపై రైతులకు అధికారులు ముందుగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details