పశ్చిమగోదావరి జిల్లా టీ.నరసాపురం మండలం అల్లంచర్ల గ్రామంలో ఉన్న సర్వే నెం.26లోని సుమారు 126 ఎకరాల అటవీ భూమిని పదేళ్ల కిందట కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఈ భూమిలో రేకుల షెడ్ నిర్మించుకున్నారు. విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రాత్రి సమయంలో వెళ్లి ఆ ఇంటిని కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
భూమి విషయంలో తగాదా... గ్రామంలో ఉద్రిక్తత
పశ్చిమగోదావరి జిల్లా అల్లంచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇంటిని కూల్చివేయడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తే తమ ఇంటిని పడగొట్టాడని బాధితులు ఆరోపించారు.
టి.నర్సాపురం పోలీస్ స్టేషన్