28 రోజుల హోం క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది.. బుధవారం విధుల్లో చేరారు. ఈ నెల ఒకటో తేదీన స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుమారుడికి సోకగా.. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు ఎస్సైతో పాటు సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. గృహ నిర్బంధంలోకి వెళ్లిన 21 మందిలో 19 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. అలాగే... మంగళవారానికి వారి 28 రోజుల క్వారంటైన్ ముగిసింది. ఈ కారణంగా... విధులకు హాజరయ్యామని కాళ్ల స్టేషన్ ఎస్సై రవివర్మ తెలిపారు.
క్వారంటైన్ పూర్తి... విధుల్లో చేరిన పోలీసులు - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. లాక్డౌన్లో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీసు స్టేషన్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన కారణంగా.. అక్కడి సిబ్బంది మొత్తం గృహ నిర్బంధంలో ఉన్నారు. బుధవారానికి వారు తమ హోం క్వారంటైన్ పూర్తి చేసుకుని విధుల్లోకి చేరారు.
క్వారంటైన్ పూర్తిచేసుకుని విధుల్లోకి చేరిన పోలీసులు