పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో కొండచిలువ కలకలం రేపింది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రైతు మంచికంటి లక్ష్మణరావు ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో బాతులతోపాటు ఇతర మూగజీవాలు ఉన్నాయి. అయితే ఫామ్‌హౌస్‌లోకి దూరిన భారీ కొండ చిలువ ఓ బాతును చంపేయగా.. మరో బాతును మింగేసింది. ఆ తర్వాత ఓ ప్లాస్టిక్ డ్రమ్‌లోకి దూరి అందులో చాలాసేపు ఉండిపోయింది. బాతుల కదలిక, శబ్దాలు లేకపోడవంతో అప్రమత్తమైన రైతు...ఫామ్‌హౌస్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండచిలువ ఓ బాతును చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. వారి సహాయంతో కొండచిలువ ప్లాస్టిక్ డ్రమ్‌లో ఉన్నట్లు గుర్తించారు. కొండచిలువను చంపాలని స్థానికులు అంతా భావించినా... రైతు లక్ష్మణరావు అందుకు నిరాకరించి అటవీశాఖ సిబ్బందికి సమాచారం తెలిపారు. ఫామ్ హౌస్కుకు చేరిన అటవీశాఖ బృందం... కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలారు.
ఫామ్‌హౌస్‌లో కొండచిలువ హల్చల్
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో కొండచిలువ కలకలం రేపింది. ఓ రైతు ఏర్పాటు చేసుకున్న ఫౌమ్హౌస్లోని బాతును చంపేసి...మరోబాతుని మింగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు కొండచిలువను పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
bhimolu