పశ్చిమగోదావరి జీలుగుమిల్లి మండలం పాకలగూడెంలో గిరిజనులు కొండచిలువను హతమార్చారు. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి మేకలను తినేందుకు వచ్చిన పది అడుగుల కొండచిలువను స్థానిక గిరిజన యువకులు కర్రలతో కొట్టి చంపారు. ఈ జాతి కొండచిలువలు చాలా ప్రమాదకరమని ఎటువంటి జంతువునైనా మింగే శక్తి వీటికి ఉందని గిరిజనులు తెలిపారు.
గిరిజనుల చేతిలో కొండచిలువ హతం - పశ్చిమ గోదావరిలో కొండచిలువ హతం
పది అడుగుల కొండచిలువను గిరిజనులు హతమార్చారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పాకలగూడెంలో ఈ ఘటన జరిగింది.
![గిరిజనుల చేతిలో కొండచిలువ హతం python killed by tribals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10269285-214-10269285-1610812839447.jpg)
గిరిజనుల చేతిలో కొండచిలువ హతం