పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామస్థులను గురువారం భారీ కొండచిలువ హడలెత్తించింది. సుమారు 12 అడుగులు పొడవున్న భారీ కొండచిలువ.. పూళ్ల గ్రామంలోని జంగంవీధి వద్ద కనిపించటంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో కొందరు యువకులు ధైర్యం చేసి, కర్రలు, గునపాలతో కొండచిలువను చంపటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చుట్టుపక్కల ఎటువంటి అడవులు, నిర్మానుష్య ప్రాంతాలు లేకపోయినా.. వన్యప్రాణులు గ్రామంలోకి రావటంతో గ్రామస్థులు భయపడుతున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి కాలువ నీటిలో ఈ కొండచిలువ కొట్టుకువచ్చి ఉంటుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
భారీ కొండచిలువ హతం - పూళ్లలో కొండచిలువ న్యూస్
చుట్టుపక్కల అడవులు, నిర్మానుష్య ప్రదేశాలు లేవు.. కానీ ఎక్కడ నుంచి వచ్చిందో ఓ కొండచిలువ గ్రామంలోకి ప్రవేశించింది. కొండచిలువను చూసిన గ్రామస్థులు భయబ్రాంతులకు గురయ్యారు. యువకులు ధైర్యం చేసిన కొండచిలువను చంపేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్లలో జరిగింది.
భారీ కొండచిలువ హతం