సదావర్తి భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీని నియమిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నలుగురు సభ్యులతో జన్మభూమి కమిటీలను నియమిస్తే... ఇప్పుడు వాటిస్థానంలోనే ప్రజల సొమ్మును వేతనాలుగా ఇచ్చి 40 మందిని నియమించారని చెప్పారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలకు రంగులు మార్చడం దారుణమన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతీపైసా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పైడికొండల - Pydikondala Manikyala rao
సదావర్తి భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని... మాజీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
![ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పైడికొండల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4346872-155-4346872-1567684542323.jpg)
మాజీ మంత్రి మాణిక్యాలరావు