తణుకు పట్టణంలో 52 కేంద్రాల్లో 5,700 మంది పిల్లలకి పోలియో చుక్కలు వేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 52 కేంద్రాలలో పోలియో చుక్కలు వేయడానికి 220 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
తణుకులో పల్స్ పోలియో.. ప్రారంభించిన ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు పిల్లలకు చుక్కలు వేశారు.
తణుకులో పల్స్ పోలియో కార్యాక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే