రేపటి నుంచి నియోజకవర్గంలో పది రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు జరుగుతాయని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు.
నేరుగా తెలుసుకుంటాం..
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారనే విషయాల మీద నేరుగా కలిసి తెలుసుకుంటామన్నారు. తణుకు నియోజవర్గంలో వారం రోజుల నుంచి చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చైతన్య యాత్రలు జరిగే గ్రామాల్లోనూ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.
ఇవీ చూడండి:
'జగన్ లేఖ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చుతుంది'