పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో నరసాపురం పురపాలక వార్డు వాలంటీర్లకు నియామక పత్రాలు ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు అందజేశారు. సేవా భావంతో పనిచేస్తూ...పథకాలను ప్రజలకు చేరువ వేయడంతో పాటు బాధ్యతగా ఉండాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి...వాలంటీర్లు ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం మంచి భవిష్యత్తు కల్పించి అన్ని విషయాల్లో తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.
వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత - narsapuram
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణంలో పురపాలక వార్డు వాలంటీర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకమని అన్నారు.
పురపాలక వార్డు వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత