పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వలస కూలీలు, వాహనచోదకులు 1100 మందికి సాగిరాజు సాయి కృష్ణంరాజు భోజనం అందజేశారు. సింగవరం కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయా ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న వారికి భోజన పొట్లాలు, తాగు నీటి ప్యాకెట్లు, పేపర్ కంచాలు అందించారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు తమవంతు సహాయంగా వీటిని అందజేస్తున్నట్లు సాయి కృష్ణంరాజు తెలిపారు.
జాతీయ రహదారిపై వలస కూలీలకు భోజన సదుపాయం - west godavari dst corona news
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో రహదారిపై వెళ్లే వారికి సాగిరాజు కృష్ణంరాజు భోజనం అందజేశారు. దాదాపు 1100 మందికి తన సొంత ఖర్చులతో ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
![జాతీయ రహదారిపై వలస కూలీలకు భోజన సదుపాయం providing food to migrate workers at west godavari dst denduloor mandal singavaram junction](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7280610-158-7280610-1589987715277.jpg)
providing food to migrate workers at west godavari dst denduloor mandal singavaram junction