అన్నా క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యాక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నా క్యాంటీన్ల మూసివేతపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. క్యాంటీన్లపై ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేజని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి పేర్లు,రంగులు మార్చినా అన్న క్యాంటీన్లను తెరవాలని వారు డిమాండ్ చేశారు.
సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఇది - undefined
పేదల సంక్షేమానికి గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు.
సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఇది