ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆస్తి పన్ను పెంపును ఉపసంహరించుకోవాలి' - Property tax hike should be withdrawn newsupdates

కరోనా సమయంలో ప్రజలు ఉపాధి, వ్యాపారాల్లేక ఇబ్బందులు పడుతుంటే... పన్నులు పెంచడం సరికాదని రాష్ట్ర పౌర సమాఖ్య నాయకులు అన్నారు. ప్రజలపై భారాన్ని మోపే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Property tax hike should be withdrawn at westgodavari district
'ఆస్తి పన్ను పెంపును ఉపసంహరించుకోవాలి'

By

Published : Dec 21, 2020, 5:39 PM IST

కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే పట్టణాల్లో ఆస్తి పన్ను పెంచటానికి ఆర్డినెన్స్ జారీ చేయటం దారుణమని.. ఏపీ రాష్ట్ర పౌర సమాఖ్య నాయకులు వెంకటేశ్వరావు ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్​జీఓ హోంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కరోనా కారణంగా నిర్వహించలేమని.. హైకోర్టులో ప్రభుత్వం వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇలాంటి తరుణంలో.. ప్రభుత్వం ప్రజలపై భారం మోపడానికి సిద్ధం కావటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్ను రాయితీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మాత్రం ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో సైతం ఆస్తిపన్ను పెంచుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్ చేయడమే కాక.. వాటిని చట్టాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని వెంకటేశ్వరరావు ఆగ్రహించారు. ఆస్తి పన్ను పెంపు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details